విషాదం.. మిద్దె కూలి మహిళ మృతి

AP: కడప జిల్లా యర్రగుంట్ల మండలం వలసపల్లి ఎస్సీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. మిద్దె కూలి ఈరమ్మ (40) అక్కడికక్కడే మృతి చెందింది. సమీపంలోని క్వారీలో జరిగే బ్లాస్టింగ్ వల్ల ఇళ్లకు పగుళ్లు వచ్చి ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరమ్మ మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్