పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో రోడ్ల దుస్థితిపై ఓ గిరిజనుడు బురదలో పడుకుని వినూత్నంగా నిరసన తెలిపాడు. ఉదయపురం పంచాయతీ పరిధిలోని అడ్వానంగూడ-సంజువాయి సెంటర్ మధ్య 3 కి.మీ. మార్గం బురదమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సొంత మండలంలోనే ఈ పరిస్థితి ఉందంటూ, ప్రయాణించలేక పోతున్నామని గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.