ఏపీలో చెట్టు కింద గిరిజన మహిళ ప్రసవం (వీడియో)

AP: మర్రి చెట్టు కింద గిరిజన మహిళ ప్రసవించిన హృదయవిదారక ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీలోని లోసింగికి చెందిన పాంగి సాయి అనే గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. అంబులెన్స్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు సుమారు 4 కిలోమీటర్లు డోలీపై తీసుకొచ్చారు. నొప్పులు ఎక్కువ కావడంతో మర్రి చెట్టు కింద ఆమె ప్రసవించింది. ప్రసవం అనంతరం అంబులెన్స్ రావడంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్