తాత్కాలిక వంతెన నిర్మించుకున్న గిరిజనులు (వీడియో)

AP: అల్లూరి జిల్లా చింతపల్లి మండలం తాజంగి పంచాయతీ పరిధిలో ఓ వాగుపై గిరిజనులు తాత్కాలిక వంతెన నిర్మించారు. బోయపాడు, బూడిదపాడు, వనజాజుల సహా పలు గ్రామాల ప్రజలు ఏకమై కర్రలను సమకూర్చుకుని వంతెనను నిర్మించారు. పాఠశాల విద్యార్థులు, గ్రామస్తుల రాకపోకలకు ఈ మార్గం కీలకం కావడంతో.. తమ సమస్యకు తామే పరిష్కరించుకున్నారు. అయితే వర్షాకాలంలో కర్రల వంతెన ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕