AP: తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం ప్రజలపై భారం మోపుతోందని అన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో క్రూడాయిల్ బ్యారెల్ ధర 125 డాలర్లు ఉన్నా పెట్రోల్ రూ.60కే లభించిందన్నారు.