టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం

AP: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం జరుగుతోంది. ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు ఈ సమావేశంలో హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించి సభ్యులు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశాన్ని టీటీడీ బోర్డు అంతర్గతంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్