AP: టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 4న వైసీపీ శ్రేణులు రాష్ట్రంలోని దేవాలయాల్లో పూజలు చేయనున్నట్లు తెలిపారు. బీఆర్ నాయుడు అసాంఘిక, అనైతిక చర్యల వీడియోలు వెలుగులోకి వచ్చాయని, నెలరోజులైనా ఆయనతో రాజీనామా చేయించకపోవడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని మల్లాది విష్ణు ప్రశ్నించారు.