AP: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్, ఎన్‌ఆర్‌ఐ తోట చంద్రశేఖర్ రూ.కోటి విరాళం అందించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ను బీఆర్ నాయుడు అభినందించారు. మరోవైపు అమలాపురం వాసి నిమ్మకాయల సత్యనారాయణ రూ.15లక్షల విలువైన హెల్మెట్లను విరాళంగా అందజేశారు.