టీటీడీ ఉద్యోగి భాస్కరనాయుడుకు పాముకాటు

AP: టీటీడీ అటవీశాఖ ఒప్పంద ఉద్యోగి భాస్కరనాయుడుకు నాగుపాము కాటువేసింది. తిరుమల కళ్యాణవేదిక వద్ద ఓ పెద్ద నాగుపాము ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న భాస్కరనాయుడు పాము పట్టుకుంటుండగా కాటేసింది. తోటి ఉద్యోగులు వెంటనే టీటీడీ అశ్విని ఆస్పత్రిలోని అపోలో అత్యవసర క్లినిక్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరకంబాడీలోని అమరా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్