జూలై 15 వరకు వీఐపీ సిఫారసు లేఖలు రద్దు: టీటీడీ

AP: తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం చైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 82 అంశాలపై చర్చించి, వేసవిలో భక్తులకు మెరుగైన దర్శనం కల్పించేలా నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో వీధులకు పేర్లు మార్చడం, ఆళ్వార్ ట్యాంక్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు టాయిలెట్స్ నిర్మాణం, ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మే 1 నుండి జూలై 15 వరకు వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్