AP: పలాస మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ పదవి విషయంలో తన కుటుంబం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఎమ్మెల్యే గౌతు శిరీష ఎమోషనల్ అయ్యారు. ఈ పరిణామంతో ప్రజల ముందుకు రావడానికి మొహమాటంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కళింగ కోమటి సామాజిక వర్గాన్ని గౌరవించి, వారి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. రాజకీయంగా ఇచ్చిన మాట తప్పినందుకు నియోజకవర్గ ప్రజలకు, కళింగ కోమట్లకు ఆమె క్షమాపణలు తెలిపారు.