జనసేన ఇంచార్జి పదవి నుంచి టీవీ రామారావు ఔట్

AP: జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును పార్టీ అధిష్టానం తప్పించింది. ఈ విషయాన్ని పార్టీ క్యాడర్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. కొవ్వూరు నియోజకవర్గంలోని సహకార సొసైటీల నియామకాల్లో అన్యాయం జరిగిందని టీవీ రామారావు నేతృత్వంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగిన నేపథ్యంలోనే ఆయనను బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్