పవన్ కళ్యాణ్ బాటలోనే టీవీకే అధినేత విజయ్!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. అంతేకాదు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ బాటలోనే విజయ్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో పవన్ సైతం టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పవన్ కూడా రెండు చోట్లా పోటీ చేశారు. అప్పుడు పవన్ పోటీ చేసిన గాజువాకలో, ఇప్పుడు విజయ్ బరిలోకి దిగుతున్న పెరంబూర్‌లో శ్రామిక జనాభా ఎక్కువ. భీమవరంలో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు విజయ్ పోటీ చేస్తున్న తిరుచ్చి ఈస్ట్‌కి కూడా ఇదే సెంటిమెంట్ ఉంది.

సంబంధిత పోస్ట్