రెండు కార్లు ఢీ.. ఇద్దరు మృతి

AP: ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం మూలగుంటపాడు రన్‌ వేపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రెండు కార్లు బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులు పొన్నలూరు మండలం సింగర్ గొట్లపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి, ఇమ్రాన్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕