AP: ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఇద్దరు బంగారు వ్యాపారుల వద్ద గుర్తు తెలియని దుండగులు 2 కిలోల బంగారాన్ని దోచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కోయంబత్తూరు నుంచి నగల దుకాణాలకు బంగారం సరఫరా చేసేందుకు వచ్చిన ఆ వ్యాపారులను దుండగులు అడ్డగించి, నగర శివార్లకు తీసుకెళ్లి దాడి చేసి బెదిరించినట్లు సమాచారం.