AP: నంద్యాల జిల్లా, రుద్రవరం మండలం ముత్తులూరు గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ (TDP), వైసీపీ (YCP) వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో వెంకటస్వామి అనే వ్యక్తిపై ప్రత్యర్థులు గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం రుద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.