పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పేకేరు, రాపాక గ్రామాలకు చెందిన కరిపెట్టి సింహాద్రి అప్పన్న(57), గెడ్డం సందీప్(17)లు కాకినాడ జిల్లా సింగరంపాలెంలో వరి కోతలు కోసేందుకు వాహనాన్ని తీసుకెళ్తుండగా.. రామయ్యపాలెం వద్ద విద్యుత్ తీగలు తగిలాయి. డ్రైవర్ వాహనం దిగేందుకు ప్రయత్నించగా, ముందు వెళ్తున్న సందీప్ హెచ్చరించడానికి వచ్చాడు. అప్పటికే వాహనానికి విద్యుత్ ప్రసరించడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.