లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఇద్దరు మృతి

AP: కడప జిల్లా చక్రాయపేట మండలంలో గురువారం మధ్యాహ్నం కొండప్పగారిపల్లె గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో నాగిరెడ్డి (35), కుందా శేఖర్ (45) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురెదురుగా వచ్చిన స్కూటీలు వేగంగా ఢీకొన్నాయని, ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై మరణం సంభవించిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్