మట్టి మిద్దె కూలి ఇద్దరు దుర్మరణం (వీడియో)

ఏపీలోని అనంతపురం జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. విడపనకల్ మండలం హావళిగి గ్రామంలో మట్టి మిద్దె కూలి దంపతులు మృతి చెందారు. మృతులు మారప్ప (49), లక్ష్మీ (45)గా గుర్తించారు. ప్రమాదంలో మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మారప్ప గ్రామంలో నూతన ఇంటిని నిర్మించుకున్నాడు. తెల్లారితే కొత్త ఇంటి గృహప్రవేశం.. కానీ రాత్రి కురిసిన వర్షానికి మిద్దె కూలడంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్