TG: ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో బేల మండలం సాంగ్డి సొంఖేశ్‌లో పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.