AP: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుళ్లు ఏ-5 బాబురావు, ఏ-6 సాంబయ్యలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిద్దరి పాత్రపై విచారణ అనంతరం ఈ అరెస్టులు జరిగాయి. భారీ భద్రత మధ్య ఇద్దరినీ 2వ ACM కోర్టుకు తరలించారు. మరికొద్ది సేపట్లో వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు సిట్ అధికారులు తెలిపారు.