ఏపీలో స్క్రబ్‌ టైఫస్‌తో మరో ఇద్దరి మృతి

AP: గుంటూరు జీజీహెచ్‌లో స్క్రబ్ టైఫస్‌తో పల్నాడు జిల్లా కొమెరపూడి చెందిన లూర్థమ్మ(59), బాపట్ల జిల్లా డేగావారిపాలేనికి చెందిన నాగేంద్రమ్మ(73) మరణించారు. లూర్థమ్మ కిడ్నీ సమస్యలుతో, నాగేంద్రమ్మ అధిక జ్వరంతో చేరగా ఇద్దరికీ స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా తేలింది. శనివారం ప్రకాశం జిల్లాకు చెందిన ధనమ్మ(64) కూడా ఇదే వ్యాధితో మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 50 కేసులు నమోదుకాగా, జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి 14 మందికి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్