టీడీపీలోకి ఇద్దరు వైసీపీ ఎంపీలు?

AP: ఈ ఏడాది జూన్ లో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న వైసీపీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి టీడీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే సీఎం చంద్రబాబును కలుస్తానని ప్రకటించారు. వైసీపీ హయాంలో తన నియోజకవర్గంలో గృహ నిర్మాణంలో అవినీతి జరిగిందని, దానిపై ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబును కలుస్తానని ఆయన తెలిపారు. అయితే, ఇది రాజకీయంగా దగ్గరయ్యేందుకేనని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్