AP: అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని APCPDCL సీఎండీ పుల్లారెడ్డి సూచించారు. ఏదైనా అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని ఆయన తెలిపారు. అలాగే, కృష్ణా (6281709355), ఎన్టీఆర్ (9440817561), గుంటూరు (9440817526), బాపట్ల (9281413774), ప్రకాశం (7382623148), మార్కాపురం (7780420711) మరియు సీఆర్డీఏ (8331092947) జిల్లాల వారీగా కేటాయించిన ప్రత్యేక నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.