ఏపీలో నిరంకుశ పాలనపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారంటూ శనివారం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పోలీసులు, మీడియా యంత్రాంగాలను ఉపయోగించి ప్రశ్నించే గొంతులను చంద్రబాబు ప్రభుత్వం నొక్కేసే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందన్నారు. పోలీసు రాజ్యమా? నియంతృత్వ రాజ్యమా? అన్నట్లుగా మారిందన్నారు.