AP: రాష్ట్రంలో 590 మంది వేద పండితులు ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్నారని, వారికి నెలకు రూ.3,000 భృతి అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు టీటీడీ, దేవాదాయ శాఖ సంయుక్తంగా శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తదితర అధికారులు పాల్గొని సంబంధిత విషయాలపై చర్చించామన్నారు.