ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ భవిష్యత్తుపై కొత్త చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వ్యతిరేకత పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయంలో విశ్లేషకులు సైతం వైసీపీ విజయంపై ధైర్యంగా మాట్లాడలేకపోతుండటంతో జగన్ తిరిగి సీఎం అయ్యే అవకాశాలు తక్కువేనన్న ప్రచారం జోరందుకుంది.