అంబటి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్

సీఎం చంద్రబాబుపై  మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. అంబటి బరితెగించి దుర్మార్గమైన భాషతో ముఖ్యమంత్రిని కించపరిచారని అన్నారు. ఇకపై సహించేది లేదని, చట్టప్రకారమే గుణపాఠం చెబుతామన్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా అంబటి భాషను జుగుప్సాకరమని విమర్శిస్తూ, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. వైసీపీ నేతలు అధికారంలో కోల్పోయేసరికి పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తూ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

సంబంధిత పోస్ట్