అల్లు అర్జున్ సినిమా పాట పాడిన కేంద్రమంత్రి

AP: విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో బీజేపీ నాయకుడు జీవీఏఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో కేంద్ర మంత్రి సురేష్ గోపి శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారి హోమంలో పాల్గొని, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. తెలుగు ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురంలో' సినిమాలోని పాట పాడి అందరినీ అలరించారు.

సంబంధిత పోస్ట్