కూటమి ఐక్యతే రాష్ట్రానికి శ్రీరామరక్ష: పవన్ కల్యాణ్

AP: రాష్ట్ర అభివృద్ధికి కూటమి ఐక్యతే అత్యంత కీలకమని, ఈ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు 'తెలుగు జాతి ఆత్మగౌరవం' అనే ఆశయంతో స్థాపించిన ఈ పార్టీ, ఉమ్మడి రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అద్భుత అధ్యాయాన్ని లిఖించిందని ఆయన స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్