ఏపీలో అకాల వర్షం.. ముగ్గురు మహిళలు మృతి

ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ, మార్కాపురం జిల్లాలో అకాల వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. భారీ వర్షం, ఈదురు గాలులు, వడగండ్ల వాన కారణంగా చేతికొచ్చిన అరటి, బొప్పాయి పంటలు నీటిపాలయ్యాయి. ఈ దుర్ఘటనలో పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి చెందారు. గంటా పురం గ్రామంలో రైతు కూలీ గంట శోభరాణి (40), బోడపాడులో ఒంటేరు పుల్లమ్మ (47), చింతకుంట్ల కుమారి (50) మృతి చెందారు. గిద్దలూరు మండలంలో 130 ఎకరాలలో అరటి పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

సంబంధిత పోస్ట్