AP: అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సింగిల్ యాజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలన్నారు. బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దన్నారు. 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లో డిస్పోజ్ చేయాలని ఆదేశించారు.