AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో ఆయనను అరెస్ట్ చేసి.. అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.