AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 140 రోజుల జైలు జీవితం తర్వాత మళ్లీ నియోజకవర్గంపై దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనపై 11 కేసులు నమోదయ్యాయి. కేసుల భయం వీడి, అన్ని వర్గాలను కలుపుకొని, గ్రూపుల వివాదాలను సరిదిద్దుకుంటూ వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఆయన సుడిగాలి పర్యటనలను అధికార పార్టీ నిఘా వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. రాబోయే రోజుల్లో గన్నవరం రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.