వల్లభనేని వంశీ అనుచరుడికి రిమాండ్

AP: టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో వల్లభనేని వంశీ అనుచరుడైన రామాంజనేయులును పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 15 వరకు కోర్టు రిమాండ్ విధించింది. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో, సత్యవర్ధన్‌ను బెదిరించి కేసును ఉపసంహరించుకునేలా చేయడంతో రామాంజనేయులు కీలక పాత్ర పోషించాడు. గత పది నెలలుగా నిందితుడు పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో ఉన్నాడు.

సంబంధిత పోస్ట్