AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. ఇద్దరు ప్రధాన అనుచరులు వజ్రకుమార్, తేలప్రోలు రాముకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వారిని జైలుకు తరలించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇద్దరిపైనా ఆరోపణలు వెల్లవెత్తాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇద్దరూ కోర్టులో లొంగిపాయారు. విచారించిన ధర్మాసనం ఈ నెల 15 వరకు రిమాండ్ విధించింది.