AP: అనకాపల్లి జిల్లా, యలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాలీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఫ్రూట్స్ లోడ్‌తో ఉన్న టాటా ఇంట్రా వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవారిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.