జనసేనలో చేరిన వంగవీటి రాధా

AP: కాపు వర్గం కీలక నాయకుడు వంగవీటి రాధా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, వంగవీటి రాధా జనసేన తరపున విజయవాడ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వంగవీటి రాధా, గతంలో ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ పార్టీలలోనూ పనిచేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕