AP: వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇవాళ, రేపు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు.