వాయుగుండం ఎఫెక్ట్.. అర్థరాత్రి నుంచి ఈ ప్రాంతాల్లో ఎడతెరపి లేని వర్షం

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకుంది. బుధవారం ఉదయం లోగా ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్