మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న వర్మ

AP: కాకినాడ జిల్లా పిఠాపురంలో, గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించిన వర్మకు సొంత పార్టీ షాక్ ఇచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో, వర్మ ఆ సీటును త్యాగం చేశారు. అయితే, తాజాగా పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ పదవి నుంచి కూడా వర్మను హైకమాండ్ తప్పించింది. ఈ నిర్ణయంతో తీవ్ర మనస్తాపానికి గురైన వర్మ ప్రెస్ మీట్‌లో కన్నీళ్లతోనే తన ఆవేదనను వ్యక్తం చేసి, మధ్యలోనే వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్