అతి భారీ వర్ష సూచన.. రేపు స్కూళ్లకు సెలవు

AP: రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో నెల్లూరు జిల్లా అధికారులు బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. APSDMA ప్రకారం.. బుధవారం ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో మిగతా జిల్లాలకూ సెలవులు ప్రకటించాలని పేరెంట్స్, స్టూడెంట్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్