AP: దిత్వా తుఫాన్ ప్రభావంతో నేడు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. NLR, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు… కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, NTR జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశముందంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేడు తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు.