సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు

AP: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా, రేపు సాయంత్రానికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో మధ్య ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 45-65 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారుల హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕