AP: సీఎం చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిలో రాజధాని ప్రాంత రైతుల అభ్యర్థన మేరకు పరిశీలనకు వెళ్లిన తమ పార్టీ నాయకులపై దాడులు చేయించారని, అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ఈ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, బాధితులనే నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని జగన్ విమర్శించారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని చంద్రబాబుని ప్రశ్నించారు.