AP: పుంగనూరులోని చదళ్ళలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన వైసీపీ నాయకురాలు సౌందర్య కారుపై టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. నామినేషన్ ప్రక్రియ కోసం వచ్చిన ఆమె కారును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతిన్నది. ఘటన జరిగిన ప్రదేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.