AP: ఎన్టీఆర్ జిల్లా, మైలవరం - నూజివీడు ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రాల గ్రామానికి చెందిన సంతాన సాయిరాం అనే యువకుడు దుర్మరణం చెందాడు. మైలవరం నుంచి తన స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా వెల్వడం బ్రిడ్జి వద్ద టిప్పర్ను ఆయన బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎస్సై సుధాకర్ దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.