AP: ACA క్రికెట్ స్టేడియంలో మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) టీ-20 క్రికెట్ ట్రోఫీని నారా బ్రాహ్మణి, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు పాల్గొన్నారు. ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారిణులు అవకాశాలు వస్తే అద్భుతంగా రాణిస్తారని నారా బ్రాహ్మణి అన్నారు.