VIDEO: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు, లోకేష్

AP: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ గురువారం శ్రీ సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు జడ్పీ పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లల పక్కనే కింద కూర్చుని వారితో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. స్టూడెంట్స్ జీవిత లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు చంద్రబాబు పాఠాలు బోధించగా, లోకేశ్ విద్యార్థిగా మారారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్