AP: ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం బోదవాడ గ్రామంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ నేతలు గడ్డం నరేశ్, అతని అనుచరులు సుమారు 30 మంది కలిసి టీడీపీ నాయకుడు శ్రీలం లక్ష్మయ్య, అతని కుటుంబ సభ్యులపై రాడ్లు, రాళ్లతో దాడి చేశారని ఆరోపణలున్నాయి. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.